అమ్మ కోప్పడుతుంది!

అమ్మ కోప్పడుతుంది!

పరిణమిస్తున్న ప్రాణాంతక పరిస్థితులను చూసి!

ఉద్యమిస్తున్న విష గాలుల్ని చూసి!

నిర్జీవం అవుతున్న మంచినీటి ఊట లను చూసి!

ప్రకృతి అమ్మ కోప్పడుతుంది!

గతి తప్పిన మానవ అడుగుల్ని చూసి

మారుతూ భవిష్యత్తు కు మరణం తెస్తున్న మానవ మొండి వైఖరిని చూసి!

దగ్ద మౌతున్న కిలకిలల సవ్వడి నాకు వినిపిస్తుంది!

పిల్ల గాలులకు పరవశించి తుళ్ళిపడిన ఆ కొమ్మల హరిత పాత్రల నిర్జీవపు దేహం నాకు కనిపిస్తుంది!

పచ్చదనం తో ప్రాణాలు నిలబెడుతున్న ఆ పర్యావరణం

కలుషితమై కల్లోలమై గతి తప్పుతూ సతమతం అవ్వడం నాకు తెలుస్తూనే వుంది!

ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని కదా లెక్క లేని జీవుల చర్యలు అనునిత్యం వీక్షించే సాక్షిని కదా అని ఆ ప్రకృతి మాత కోప్పడుతుంది.

ఛిద్రమై చిక్కి శల్యమై దీన అవస్థలు పడే బదులు

ఇప్పుడే నివారణ చర్యలు తీసుకోవచ్చు కదా అని

హిత బోధ చేస్తూ వుంది!

ఇంకా చీకట్లో లో చిక్కుకొని నీకు నువ్వుగా నశిస్తాను అంటే నేనేమీ చేస్తాను చివరి మాటగా అంటూ అందరినీ చైతన్య పరుస్తుంది!.

సంపుటి 44 · సంచిక 5 · సెప్టెంబర్ – అక్టోబర్ · 30 సెప్టెంబర్, 2026