2027 సంక్రాంతి పోటీలు ప్రకటన

2027 సంక్రాంతి పోటీలు

కథలు · కవితలు · ముఖ చిత్రం. మీ రచనల్ని అక్టోబర్ 15 లోపల tjarticles@tfas.net కి పంపండి.

బహుమతులు

పెద్దల కథలకి
$100, $50, $25
పెద్దల కవితలకి
$50, $25, $15
18 సంవత్సరాల లోపు పిల్లల చిత్రాలు, రచనలకి
$50, $25

రచనలకి కొన్ని ముఖ్యమైన షరతులు

  1. Microsoft Word file మాత్రమే పంపగలరు. PDF files పంపవద్దు.
  2. Unicode fonts వాడండి. ఉదా॥ గౌతమి లాంటి Word లో built-in fonts గానీ, అన్నమయ్య, NTR (https://telugufonts.net/ చూడండి) లాంటి fonts గానీ వాడండి. Anu-script fonts వాడవద్దు.
  3. Single-space లో ఎనిమిది (8) పేజీల లోపు ఉండాలి.
  4. కథలైనా, కవితలైనా, ఒక్కో రచయిత నుండి మొత్తం రెండే స్వీకరిస్తాము. ఎక్కువ పంపిస్తే, మాకు అందిన మొదటి రెండే పోటీకి అంగీకరిస్తాము.
  5. కవితలు ఏ విధంగానైనా ఉండచ్చు, ఛందస్సు తోనే ఉండాలన్న పట్టింపు లేదు.
  6. వ్యాకరణం, విరామ చిహ్నాలు జాగ్రత్తగా అనుసరించ గలరు (https://bit.ly/3WVW1rO చూడండి).
  7. ఇంతకు ముందు తెలుగు జ్యోతికి పంపిన రచనలు ఈ సంవత్సరం మళ్ళీ పరిశీలించము.
  8. మీ రచనలతో పాటు మీ పేరు, ఊరు, చిరునామా, ఈమెయిల్ అడ్రసు, మీ పరిచయం, పది పంక్తులకు మించకుండా పంపండి.
  9. రచన మీ స్వంతమే అనీ, మరెక్కడా ప్రచురించలేదనీ మీ ధృవీకరణ పంపండి.
  10. తెలుగు జ్యోతి సంపాదక వర్గ సభ్యులూ, న్యూ జెర్సీ తెలుగు కళా సమితి కార్య వర్గ సభ్యులూ, వారి కుటుంబ సభ్యులూ బహుమతులకి అర్హులు కారు.
  11. బహుమతి రాని కొన్ని రచనలని సాధారణ ప్రచురణకి స్వీకరిస్తాము.

పోటీలకే కాకుండా, తెలుగు జ్యోతి లో సాధారణ ప్రచురణ కోసం మీ పిల్లల చేత తెలుగులో గానీ, ఆంగ్లంలో గానీ పసందైన కథలూ కబుర్లూ ఏవైనా వ్రాసి పంపవలసిందిగా కూడా ప్రార్థన.

మరిన్ని వివరాలకి

సంపాదక వర్గం: editor@telugujyothi.com
ఊటుకూరి విజ్ఞాన్ కుమార్, ఉప్పల సుధాకర్, తాడేపల్లి కుమార్, తాతా వేంకట సత్య, తిప్పాభొట్ల రవి, డా॥ రమ్యా రావు, యేలూరిపాటి అపర్ణ